TEJA NEWS

వరంగల్ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

వరంగల్ జిల్లా:
వరంగల్ జిల్లా కేంద్రంలో 14 మంది మావోయిస్టులు ఈరోజు ఉదయం లొంగిపో యారు. పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిని ఐజి చంద్రశేఖర్ రెడ్డి, మీడియా ముందుకు తీసుకువచ్చా రు. ఒక్కొక్క మావోయిస్టు కు రూపాయలు 25 వేల ఆర్థిక సహాయం అందించా రు. ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ….

నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆయన సూచిం చారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే మా ఉద్దేశం ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయిన సహకారం అందిస్తాం జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐజి చంద్రశేఖర్ రెడ్డి, తెలిపారు.

లొంగిపోయిన వారి పేర్లు

AOBSZC డివిజన్ గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు మడవి అంద @ రాజేష్, మరియు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి @ ఉదయ్ కి చెందిన ప్రొటెక్షన్ టీం ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి, డివిజన్ కమిటీ సభ్యులు మరకం హిడుమే, మడకం జోగి @ కోవాసి జోగి, పోడియం భూమిక @ సోడి కోసి @ వెన్నెల, సోడి బుద్రి @ బద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేష్ @ భీమా మిలిషియా సభ్యులు అట్టం బుద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సుక్కు @ అర్జున్, కోర్సా సుక్కు లొంగిపోయినవారు

ఛత్తీసగఢ్, ఒరిస్సా రాష్ట్రల లో పలు విధ్వంసకర సంఘటనలలో, పోలీసు లపై దాడి చేసిన ఘటనల లో, ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన సంఘట నలలో పాల్గొన్నారు.