
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తిరుమలకుంట విద్యార్థులను సత్కరించిన గ్రామస్తులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
అశ్వరావుపేట మండలం. తిరుమల కుంట గ్రామానికి చెందిన జుజ్జురి సాయి పద్మ, బెల్లంకొండ లీల వరప్రసాద్ ఇంటర్లో మంచి మార్కులు సాధించారని గ్రామస్తులు సత్కరించారు. తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకొని, చదువులో రాణించాలని సూచించారు. కేక్ కట్ చేసి, శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు.
