TEJA NEWS

హత్య కేసులోని ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష

2019 జులై 23వ తేదీ రాత్రి సమయంలో మురికిపూడి గ్రామంలో చికెన్ పకోడీ వ్యాపారం చేసుకుంటున్న షేక్ ఖాదర్ వలీ బాబా @ బాబు [తండ్రి] దరియా హుస్సేన్, పోలూరు గ్రామం, యద్దనపూడి మండలం అను అతన్ని వేమవరం గ్రామం, బల్లికురవ మండలంనకు చెందిన వడితే నాగేశ్వర నాయక్ [తండ్రి] బిచ్యా @ పిచ్యా నాయక్ అను అతను తను సన్నిహితంగా ఉన్న మహిళతో షేక్ ఖాదర్ వలీ బాబా @ బాబు సన్నిహితంగా ఉండటం తట్టుకోలేక కత్తితో నరికి చంపినా ఘటన లో ముద్దాయి.

దీని గూర్చి మృతిని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి మరియు ప్రస్తుత చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ G. అనిల్ కుమార్ కేసు నమోదు చేయగా, అప్పటి చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. సుబ్బారావు కేసు దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్టు చేసి, చార్జ్ షీటు వేసినారు. ఈ కేసులో నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన దేశి రెడ్డి మల్లారెడ్డి బాదితుని తరుపున వాదనలు వినిపించగా, స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయ అధికారిని నేతి సత్య శ్రీ ముద్దాయికి యావజ్జీవ కారాగరం విధించారు