
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థిని రజితను అభినందించిన యువ నాయకుడు, డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి
- వనపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలో కుమ్మరి తిరుపతయ్య కూతురు రజిత ఇంటర్మీడియట్ ఫలితాల్లో 800 మార్కులతో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నేషనల్ హెడ్ (హెల్త్ కేర్ ప్రొపెషనల్స్) డాక్టర్ జిల్లెలఆదిత్య రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త తిరుపతయ్య స్వగృహానికి వెళ్లి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చాటిన రజితను శాలువాతో సన్మానించి భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి, ఉద్యోగం సాధించాలని వారు దీవించారు. పై చదువులకు ఎలాంటి అవసరం ఉన్న అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. యువత ఉన్నత విద్యలను అభ్యశించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు గ్రామస్తులు జిల్లెల ఆదిత్య రెడ్డి కి ధన్యవాదాలు తెలిపి అభినందించారు
_ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్ , ఏఐపిసి జిల్లా ఉపాధ్యక్షులు నాగర్జున,వనపర్తి మండల్ (NSUI )ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్,కంబలాపూర్ మాజీ ఎంపిటిసి ఎల్లస్వామి,మండల ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, మండల సోషల్ మీడియా సొప్పరి రమేష్ తదితరులు పాల్గొన్నారు
