TEJA NEWS

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయండి : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • విపక్షం చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకుండా చూడాల్సిన బాద్యత పసుపు సైనికులదే: ప్రత్తిపాటి
  • భవిష్యత్ కు గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన క్లస్టర్ ఇన్ ఛార్జ్ లకు ప్రశంసాపత్రాలు అందించి అభింనందించిన ప్రత్తిపాటి

ఎన్నికలకు ముందు ఎంత కసితో పనిచేశారో, ఇప్పుడూ ప్రభుత్వం తరుపున ప్రజలకోసం అంతే కసిగా పనిచేయాలని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా టీడీపీసైనికులు వ్యవహరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పలువురు క్లస్టర్ ఇన్ ఛార్జ్ లకు ప్రత్తిపాటి శుక్రవారం ప్రశంసాపత్రాలు అందించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఇన్ ఛార్జ్ ల పనితీరును మెచ్చుకున్న ప్రత్తిపాటి, వారిని భుజం తట్టి అభినందించారు. పార్టీ మేనిఫెస్టోను, విధివిధానాలను ప్రజలకు పరిచయం చేయడంలో ఎంత ఉత్సాహంగా పనిచేశారో, అంతకు రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్ లో పార్టీ శ్రేణులు పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు.

మన ఎదుగుదలను, ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేని విపక్షం, ఆ పార్టీ నేతలు చేస్తున్నదుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించకుండా వారికి వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత పసుపు సైనికులపైనే ఉందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. నిరంతరం ప్రజల్లో ఉండేవారికే పార్టీ అధినాయకత్వం సరైన గుర్తింపునిస్తుందనే వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో 12 మంది క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు ప్రత్తిపాటి చేతులుమీదుగా ప్రశంసాపత్రాలు స్వీకరించి, తమ అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పఠాన్ సమాధ్ ఖాన్, గంగా శ్రీనివాసరావు, మద్దిబోయిన శివ , ముల్లా కరిముల్లా, గంజి శ్రీనివాసరావు, జ్ఞాన్ రెడ్డి, మురకొండ మల్లిబాబు, వివిధ హోదాలలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.