
ప్రజలిచ్చే అర్జీలను కాగితాల్లా చూడకుండా, వాటిలోని వేదన, బాధల్ని అర్థం చేసుకోండి : మాజీమంత్రి ప్రత్తిపాటి
- ప్రజల అంతరంగాన్ని గ్రహించినప్పుడే వారి ఫిర్యాదులకు అధికారులు న్యాయం చేయగలరు : ప్రత్తిపాటి
- క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి, కూటమినాయకులు.
ప్రజలిచ్చే అర్జీలు కేవలం కాగితాలు మాత్రమే కాదని, వాటిలో అనేకమంది వేదన, ఎప్పటినుంచో వారు అనుభవిస్తున్న బాధలు, అనేక అపరిష్కృత సమస్యలు ఉంటాయనే వాస్తవాన్ని అధికారులు గ్రహించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని చీరాల రోడ్డులో మజీమంత్రి రజనీ మరిది విడుదల గోపి కి సంబంధించిన లేఅవుట్ కి ఎటువంటి అనుమతులు లేవు అని అది అనధికారంగా గత ప్రభుత్వంలో నిర్మించి ప్రజలను మోసం చేశారని మల్లెల శివనాగేశ్వరరావు మరియు కొంతమంది ప్రత్తిపాటి దృష్టికి తీసుకొని వచ్చారు.
ప్రజల అంతరంగాన్ని గ్రహించినప్పుడే, వారి ఫిర్యాదుల పరిష్కారంపై యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన కూటమినాయకులతో కలిసి గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి, అప్పటికప్పుడే వాటి పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులు లేరంటూ తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, పాఠశాలలో 25మంది విద్యాభ్యాసం చేస్తున్నారని పురుషోత్తమపట్నం గ్రామస్తులు ప్రత్తిపాటికి తెలియచేశారు. సమస్యను డీఈవో దృష్టికి తీసుకెళ్లిన ప్రత్తిపాటి, గ్రామస్తుల విజ్ఞప్తిని పరిశీలించి, పాఠశాలను కొనసాగించాలని కోరారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని, విద్యార్థులకు న్యాయం చేస్తానని డీఈవో ప్రత్తిపాటికి తెలియచేశారు. ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని, అర్హులైన వారిని గుర్తించి పింఛన్లు అందించాలని ప్రత్తిపాటి సెర్ప్, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
ఒంటరిమహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్లో ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని మాజీమంత్రి స్పష్టంచేశారు. పట్టణంలోని ఏ వార్డుల్లో ఇంకా తాగునీరు సక్రమంగా అందడం లేదని ప్రత్తిపాటి మున్సిపల్, ఆర్.డబ్ల్యూ.ఎస్ సిబ్బందిని ప్రశ్నించారు. గతంలో చెప్పినట్టుగా సమస్యను పరిష్కరించారా లేదా అని ఆయన ప్రజల్ని ఆరాతీశారు. సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్ని త్వరగా గుర్తించి, రుణాలు అందించాలని ప్రత్తిపాటి బ్యాంకర్లకు సూచించారు. అన్నిపత్రాలున్నా, అర్హతలున్నా తనకు రుణం మంజూరు చేయలేదన్న యువకుడి ఫిర్యాదుపై మాజీమంత్రి బ్యాంకర్లతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ సకాలంలో రుణాలు అందించి, వారి జీవితాలు నిలదొక్కుకునేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పఠాన్ సమాధ్ ఖాన్, గంగా శ్రీనివాసరావు, కందుల రమణ, మద్దిబోయిన శివ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు
