TEJA NEWS

ఉత్తమ ఎంపీటీసీ గా అవార్డు అందుకున్న పామూరు 2 ఎంపీటీసీ సభ్యులు ఆకుపాటి వెంకటేష్

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవములు సందర్భంగా.జిల్లా ఉత్తమ ఎంపీటీసీ గా జిల్లా ఎంపీటీసీ ల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . శుక్రవారం ఒంగోలు లో ని మల్లయ్య లింగం భవన్ లో జరిగిన పంచాయతీరాజ్ వేడుకల్లో కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణ రెండవ ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేష్ పంచాయతీరాజ్ వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి వీరభద్ర చారి చేతులమీదుగా ఉత్తమ ఎంపీటీసీ గా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో అవార్డు కు ఎంపికైన జిల్లా లోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.