TEJA NEWS

విక‌లాంగుల‌కు ఎంపికేశినేని శివ‌నాథ్ (చిన్ని) ట్రై సైకిళ్లు, వీల్ చైర్ పంపిణీ

విజ‌య‌వాడ‌: ప‌శ్చిమ నియోజ‌కవ‌ర్గంలోని 42వ‌, 46వ‌, 47వ‌, 56వ డివిజ‌న్ల‌కి చెందిన న‌లుగురు దివ్యాంగులు సుమ‌ల‌త‌, క‌ర్ణాట‌క చిన్న‌మ్మాయి, పేరాబ‌త్తుని హేమ‌శ్రీ, ఎన్.దుర్గా ప్ర‌సాద్ ల‌కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ట్రై సైకిళ్లు, వీల్ ఛైర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మం గురునాన‌క్ కాల‌నీలో ని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ శుక్ర‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ దివ్యాంగుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆరువేల రూపాయ‌ల పెన్ష‌న్ ఇచ్చి ఆదుకుంటున్నార‌న్నారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పేద వారికి సాయం చేయ‌టంలో టిడిపి ముందుంటుంద‌న్నారు. ట్రై సైకిళ్లు, వీల్ చైర్ అందుకున్న ల‌బ్ధిదారులు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి గ‌న్నే ప్ర‌సాద్ (అన్న‌), రాష్ట్ర కార్య‌ద‌ర్శి బొమ్మ‌సాని సుబ్బారావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధానకార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లాహ్, తెలుగు మ‌హిళా రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు షేక్ ఆషా, వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షుడు సొలంకి రాజు, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు బొప్ప‌న భ‌వ‌కుమార్, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, మాజీ మేయర్ తాడి శ‌కుంత‌ల‌, ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రొగ్రామ్ కోఆర్డినేట‌ర్ మాదిగాని గురునాథం, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు సుఖాసి స‌రిత‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బిసి సెల్ అధ్య‌క్షుడు న‌మ్మిభానుప్ర‌కాష్, బిసి నాయ‌కులు ప‌ట్నాల హ‌రిబాబు, క్ల‌స్ట‌ర్ ఇన్చర్జ్ ధ‌నేకుల సుబ్బారావు ,లోకేష్, బిసి సెల్ రాష్ట్ర నాయ‌కులు గుర్రం కొండ‌, డివిజ‌న్ అధ్యక్షులు నాగోతి రామారావు, శివాజీ ముదిరాజు , ఈశ్వ‌ర‌రావు, నాయ‌కులు శ్యామ్, బ‌డేషా, ఆలీ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.