
ఖబడ్దాద్ అంటూ ఎమ్మెల్యే జగన్ రెడ్డికి వార్నింగ్…నేనున్నాంటూ ఎన్.ఆర్.ఐలకు ఎంపి కేశినేని చిన్ని భరోసా
మీడియా సమావేశం నిర్వహించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
99 పైసలకే భూములు కేటాయించినట్లు నిరూపించాలని జగన్ రెడ్డికి సవాల్
ఎమ్మెల్యే జగన్ రెడ్డి అండ్ ఉల్ఫా బ్యాచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు
- పెట్టుబడులు పెట్టేవారిపై విమర్శలు చేస్తే ఊరుకోం*
- రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జగన్ వికృత చేష్టలకు తెరలేపారు*
*కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు
ఎన్నారైలు అధైర్యపడద్దు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి…పరిశ్రమలు రావాలి
సూట్ కేసు కంపెనీలు పెట్టిన వ్యక్తుల మాటలు నమ్మోద్దు
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వున్నాడనే భరోసాతో, ఆయన విజన్ పై వున్న నమ్మకంతో అమెరికాలో సంపాదించిన డబ్బులతో రాష్ట్రాభివృద్ది కోసం పెట్టుబడులు పెట్టి పరిశ్రమల స్థాపించటానికి వస్తున్న ఎన్.ఆర్.ఐలపై అసత్య ఆరోపణలతో బురద చల్లటానికి ప్రయత్నిస్తే సహించేదిద లేదు..ఖబడ్దార్ అంటూ పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎన్.ఆర్.ఐలకు నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. ఎన్.ఆర్.ఐలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని విధాలుగా తాను కూడా సహకారం అందిస్తానని తెలిపారు.
ఎన్.ఆర్.ఐ లతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలు ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావాలని ఆహ్వానించారు. ఎపి పారిశ్రామిక అభివృద్దికి కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్.ఆర్.ఐలను వెనక్కి పంపించేందుకు వైసిపి ఎమ్మెల్యే జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి, కుంభకోణాలు బయటపడతాయనే భయంతో ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ అండ్ బ్యాచ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్.ఆర్.ఐ లను వెనక్కి పంపించేందుకు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా తీసుకురావటం చేతకానీ జగన్ కి తెలిసింది డ్రామాలు ఆడటం ఒక్కటే అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను వెనక్కి పంపించేందుకు ఆ కంపెనీలపై అసత్య ఆరోపణలు చేయటం జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ డ్రామా కంపెనీ ఒక పని గా పెట్టుకుందన్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశ్రమలకు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు. భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రావటంతో ప్రజలకు ఉపాది ఉద్యోగావకాశాలు మెరుగైయ్యాయని తెలిపారు.. రాష్ట్రాభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్న క్రమంలో వాటిని అడ్డుకునేందుకు పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ రెడ్డివికృత చేష్టలు, చర్యలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులతో రాష్ట్రం స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు నడిపే పులివెందుల జగన్ రెడ్డి మరో కుట్రకు తెరదీశాడన్నారు.
జగన్ తన హయంలో ఒక పరిశ్రమను తీసుకురాకపోగా, పెట్టుబడుల కింద విశాఖలోని శారద పీఠానికి 15 ఎకరాలు రూ.15 లక్షలకే, వైజాగ్ లోని మధురవాడలో రూ.1,500 కోట్లు విలువ చేసే 97.30 ఎకరాల భూమిని రూ.187 కోట్ల కే రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మాజీ మంత్రి కొట్టు బ్రదర్స్ కంపెనీ బి.ఆర్.పి.ఎల్ (గతంలో కంపెనీ పేరు ఎన్.సి.సి) కి, వీరితో పాటు హెట్రో కంపెనీకి 81 ఎకరాలు రూ.20 కోట్లకే ఇచ్చినట్లు వెల్లడించారు. జగన్ కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని అతి తక్కువ ధరకే ఇచ్చిన శారద పీఠం, రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడులు తెస్తాయా అంటూ జగన్ అండ్ బ్యాచ్ సమాధానం చెప్పాలంటూ ఎంపి కేశినేని శివనాథ్ సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి..పెట్టుబడులు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాప్రతినిధులందరూ కృషి చేస్తుంటే, రాష్ట్రానికి రాబోయే పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయే విధంగా జగన్ డ్రామాలు నడిపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక దొంగ, అందుకు జగన్ ఎప్పుడు ఎదుటి వారిని దొంగగా చిత్రీకరించటానికి ప్రయత్నం చేస్తుంటాడన్నారు.
ఏ విదేశీ కంపెనీ అయినా పెట్టుబడి పెట్టాలంటే ముందుగా పరిశ్రమ స్థాపించబోయే రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆఫీస్ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది.అయితే జగన్ రెడ్డి తన బ్యాచ్ తోటి పరిశ్రమలు రాకముందే ఇక్కడ ఆఫీస్ లేదనే డ్రామాలు నడిపిస్తున్నాడన్నారు. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఒప్పందాల ప్రకారం కంపెనీలు కార్యాలయాలు ప్రారంభిస్తాయన్నారు. అంతవరకు కమ్యూనికేషన్ పాయింట్ కోసం ఎక్కడో ఒకచోట చిన్న ఆఫీస్ పెడతారన్నారు. పరిశ్రమలు పెట్టాలంటే ముందుగా భారీ స్థాయిలో కార్యాలయాలు నిర్మించరనీ, తాత్కలికంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు.
అదే విధంగా ఉర్సా కంపెనీ వ్యవహరిస్తుందన్నారు.. ఈ కంపెనీ సి.ఈ.వో పి.కౌశిక్ గతంలో ఏర్పాటు చేసిన జోబాక్స్ కంపెనీ 400మిలియన్ డాలర్ల టర్నోవర్ కి చేరుకుందని, ప్రమోటర్ టి.జయశంకర్ హాల్ మార్క్ గ్రూప్ చైర్మన్. హాల్ మార్క్ గ్రూప్ కంపెనీ టర్నోవర్ 2.5 మిలియన్ డాలర్లగా వుందన్నారు. అలాగే మరో ప్రమోటర్ పి.సురేష్ ఎంటర్ ప్రెన్యూర్ గా మంచి పేరు సంపాదించుకున్నారని,. కేఆర్కే టెక్, షోహాన్ హోల్డింగ్స్, ఫస్ట్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థలను ఏర్పాటు చేసి దాదాపు 75 మిలియన్ల డాలర్ల టర్నోవర్ కు చేరుకున్నారన్నారు. కె.హరీష్ ఎంటర్ ప్రెన్యూర్ గా కోయాంట్ సోల్యూషన్స్ , హ్యూజ్ గ్రానైట్స్ వంటివి ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. .
ఉర్సా కంపెనీ సీ.వోవో ఏ.సతీష్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీ నిపుణుడిగా వున్నాడన్నారు..ఉర్సా కంపెనీలోని ప్రమోటర్లకు సుమారు రూ.3,700 కోట్లపైనే నెట్ వర్త్ వుందని. అంత నెట్ వర్త్ వున్న వ్యక్తులు ఎపిలో డేటా సెంటర్ పెట్టడానికి ముందుకి వస్తే ..వీళ్లకి 99 పైసలకే స్థలం ఇచ్చామని ఎమ్మెల్యే జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దమ్ముంటే జగన్ 99 పైసలకే స్థలం కేటాయించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.
56 ఎకరాల్లో 100ఎమ్.డబ్యూ. డేటా సెంటర్ ను రూ.5196 కోట్ల వ్యయంతో, 3.5 ఎకరాల్లో ఐటీ స్పేస్ కార్యాలయాన్ని రూ81 కోట్లు చెల్లించి 48 నుంచి 52 నెలల్లో 5 ఫేజ్ ల్లో పూర్తి చేయాలి. డేటా సెంటర్ కు ఎకరానికి రూ.లక్షల చొప్పున, ఐటీ ఆఫీసుకు ఎకరా రూ.1 కోటి చొప్పున భూమి కేటాయించారు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం ఈ సంస్థకు భూ కేటాయింపులు జరిగాయన్నారు.
విదేశాల నుంచి వచ్చి ఇక్క డ పరిశ్రమలు పెట్టాలనుకునే కంపెనీలకు ముందుగా ఇక్కడ ఆఫీస్ కూడా వుండదనే కనీస పరిజ్ఞానం మాజీ ముఖ్యమంత్రి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే జగన్ 21 క్లౌడ్ కంపెనీలు పెట్టాడు. ఆ 21 క్లౌడ్ కంపెనీల్లో ఒక కంపెనీకి కూడా ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫాలోమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్ స్పైర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్ స్పైర్ హోటల్స్, క్యాప్ స్టన్ ఇన్ ఫ్రా, ఉటోపియా ఇన్ ఫ్రా ఇలాంటి 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర జగన్ సొంతమన్నారు. ఆఫీస్ అడ్రస్ లు కూడా లేని సూట్ కేస్ కంపెనీలు పెట్టిన జగన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి వచ్చే ఎన్.ఆర్.ఐలను విమర్శించటం సిగ్గు చేటున్నారు.జగన్ కి అసలు కంపెనీ స్ట్రక్చర్ పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు..ఎక్కడైనా పరిశ్రమలకు భూములు కేటాయించేటప్పుడు టెండర్ వేస్తారా. విదేశాల్లో కూడా ఎక్కడైనా పెట్టుబడిదారులకు అనుకూలమైన భూమిలిచ్చి పరిశ్రమలు తెచ్చుకుని ఉద్యోగాలు అవకాశాలు పెంచుకుంటారు. కంపెనీలకు భూమలు కేటాయించేటప్పుడు టెండర్లకి పిలవాలని జగన్ అనటం హాస్యప్పదంగా వుందన్నారు.
గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అథోగతి పాలుజేసిన వారికి బుద్ది చెప్పే విధంగా, ఎన్.ఆర్.ఐలు రాష్ట్రంలో పెట్టుబడలు పెట్టి పరిశ్రమలు స్థాపించి యువతకి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సూట్ కేసు కంపెనీలు పెట్టిన వ్యక్తుల మాటలు నమ్మోద్దన్నారు.
జగన్ కి రాష్ట్రం అభివృద్ది చెందటం అసలు ఇష్టం లేదన్నారు. ప్రపంచ బ్యాంక్ నుండి అమరావతికి నిధులు రాకుండా వుండేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేశాడని వివరించారు. రాష్ట్రం పై, యువత పై జగన్ వైఖరి పగబట్టినట్లుగా వుందన్నారు రాష్ట్రం అభివృద్ది సాధించాలని, యువతను వృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచన లేదని అందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు.
అలాగే జగన్ రెడ్డి ఆడే డ్రామాలో భాగంగానే రోజా,గుడివాడ అమర్నాథ్, విజయవాడ మాజీ ఎంపి డ్రామాలు ఆడుతున్నారని. వీరంతా జగన్ డ్రామా కంపెనీలో డ్రామా ఆర్టిస్టులన్నారు. తనపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేసినా ఊరుకుంటాను కానీ, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఎన్.ఆర్.ఐలను భయపెట్టడానికి ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయం వృద్దా చేయదల్చుకోలేదన్నారు.
రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తనని అడ్డుగా పెట్టి రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవాలని చూడటం వారి దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనం అన్నారు. నా పై విమర్శలు చేసిన వ్యక్తి సామాన్య వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకున్నవ్యక్తి..ప్రజలందరికీ జగన్ అండ్ బ్యాచ్ ఆడుతున్న డ్రామాలు ఎలక్షన్ ముందే అర్ధమైయ్యాయన్నారు. వారి మాటలు ఎవరు విశ్వసించటం లేదన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే ఏనాడు ఒక రూపాయి సాయం చేయలేదన్నారు. గత ఇరవై ఐదేళ్లుగా ఎన్.ఆర్.ఐలు రాష్ట్రాభివృద్దిలో కృషి చేస్తున్నారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ఎమ్మెల్యే జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించాడు..ఆ కోటి ఎవరికి ఇచ్చాడో ఇప్పటి వరకుక ఎవరికి తెలియదన్నారు. జగన్ కి టెక్నాలజీ పై ఎలాంటి అవగాహన లేదని. అలాంటి వ్యక్తి అసత్య ఆరోపణలకు అధైర్యపడకుండా ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఎవరైనా ఎన్.ఆర్.ఐ ల జోలికి, పెట్టుబడి దారుల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్త, నేను వారికి తోడుగా వుంటానంటూ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించిన తస్మాత్ జాగ్రత్త వెంటపడి వెంటపడి తరిమికొడతామని హెచ్చరించారు.
