
పహల్గావ్ ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , బిఆర్ఎస్ శ్రేణులు….
126 – జగద్గిరి గుట్ట డివిజన్ మగ్దూం నగర్ లోని సాయిబాబా కళ్యాణ మండపంలో నిర్వహించిన “ఛలో వరంగల్” బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల వేడుకల సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పహల్గావ్ ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అన్ని మతాల వారు సంతోషంగా జీవిస్తున్న భారతదేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉగ్రదాడికి పాల్పడిన వారు, వారి వెనుక ఉన్నది ఎంతటి వారైనా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
