TEJA NEWS

జగద్గిరిగుట్ట నుంచి ఉప్పెనై కదలాలి… రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్ సాయిబాబా కళ్యాణ మండపంలో నిర్వహించిన “ఛలో వరంగల్” రజతోత్సవ వేడుకల సమీక్షా సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఛలో వరంగల్ కార్యక్రమ ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పార్టీ ఇచ్చే ప్రతీ పిలుపుకు స్పందిస్తూ ఐకమత్యంగా నాయకులు, కార్యకర్తలు ఒక్కతాటిపై ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరోమారు ఛలో వరంగల్ సభకు భారీ సంఖ్యలో బయల్దేరి వెళ్లి రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు పాపులు గౌడ్, పాపిరెడ్డి, దాసు, బ్రహ్మానంద చారి, శశిధర్, జైహింద్, అజం, యాదగిరి, మహేందర్, విఠల్ ముదిరాజ్, శంకర్, రాజేష్, తిరుపతి, ప్రభాకర్, ఆంజనేయులు, పరశురాం, ముంతాజ్ అలీ, సాజిద్, దినేష్, గోపాల్, హనుమంత్, కురుమారెడ్డి, పాపిరెడ్డి, సంపత్ రెడ్డి, విగ్నేష్, రామరాజు, మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఇందిరాగౌడ్, ప్రధాన కార్యదర్శి శాంతి, మహిళా నాయకురాలు మంజుల, జ్యోతి, లక్ష్మి, వరలక్ష్మి, కార్యకర్తలు, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.