TEJA NEWS

తెలంగాణకు మరోసారి వర్షసూచన… రానున్న మూడు రోజులు ఈదురుగాలుతో కూడిన వర్షం… ఈ జిల్లాలకు అలర్ట్…!!

తెలంగాణను మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ తెలిపింది.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంనా వేసింది. వివరాలు… తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండగా…. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు.వడదెబ్బ తగిలి జనాలు మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల వేళ రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలుచోట్ల వేడి వాతావరణం ఉంటుందని కూడా పేర్కొంది.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ రాత్రిపూట వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎండల తీవ్రత పరంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలాఉంటే, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనరిగి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు వర్షాల పరంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదివారం (ఏప్రిల్ 27) రోజున రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూలు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, మహబబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు వర్షాల పరంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సోమవారం (ఏప్రిల్ 28) రోజున భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు వర్షాల పరంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.