TEJA NEWS

మిస్ ఇండియా పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్!

హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్-2025 పోటీల కు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి.

ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన అందమైన మహిళలు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ మే 6, 7 తేదీల్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవాతో పాటు మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

పోటీలు ప్రారంభం కావడా నికి కేవలం 8 రోజులే సమయం ఉండటంతో, ఏర్పాట్లు వేగంగా జరుగు తున్నాయి. నగరంలో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను విజయవం తంగా నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ప్రపంచంలోని అందమైన మహిళలందరూ ఒకే వేదికపై సందడి చేయనున్న ఈ పోటీలు హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. ఈ అద్భుతమైన వేడుక కోసం నగర ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.