TEJA NEWS

రైతు భోరోసా కేంద్రంలలొ ధాన్యం కొనుగోలు చేయండి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన….

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వినతి పత్రం అందజేస్తున్న కామన…

మండపేట టౌన్ …

రిపోర్టర్ స్వామి…

రైతు భోరోసా కేంద్రంలలొ ధాన్యం కొనుగులుచేయకపోవడం తో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేశ్ కుమార్ కలసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావుకలిశారు. ఈ సందర్భంగా కామన కలెక్టర్ కు వినతి పత్రముఅందించారు . ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ జిల్లాలోనీ రబీ పంట నిమిత్తం 1,60,000 ఎకరాల విస్తీర్ణం లో సాగు చేయడం తో దాదాపు 6 లక్షల క్వింటాల్ ధాన్యం పండడం తో 2 లక్షల క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రతి ఆర్ బి కే ద్వారా కొనుగోలు చేయడం వల్ల టార్గెట్ పూర్తి అయిందని, మిగిలిన ధాన్యం కొనుగోలు చేయడం లేదు అని, తక్షణం కొనుగోలు చేయాలని ఆర్ బి కే ల ద్వారా టార్గెట్ లు తొలగించి పూర్తి గా కొనుగోలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లా కు అదనంగా మరియొక లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కు ప్రభుత్వం అంగీకరించిందని రెండు రోజుల లో ఆర్డర్లు వస్తాయని చెప్పారు. అలాగే జిల్లాలోనీ మురుగు కాలువలు తవ్వడానికి 15 కోట్లు విడుదల కు శాంక్షన్ ఇస్తున్నారని మే నెలలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, చిట్టురీ వీర వెంకట సత్యనారాయణ, నిమ్మకాయల ప్రసాద్, రాయుడు వెంకట రమణ, దేవరపల్లి రాజేంద్ర, లంక సోమయాజుల శాస్త్రి, అరిగిల శ్రీ రామమూర్తి, మీసాల బాబీ, కుచ్చు బాబీ, వల్లభదసు చిన్న, మండాది గణేష్, ఆర్ సరయ్య తదితరులు పాల్గొన్నారు.