
ఐ సి డి ఎస్, సిడిపిఓల కు సమ్మె నోటీసు అందజేసిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్
వనపర్తి
మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ తో పాటు జిల్లా లోని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొంటారని తెలియజేస్తూ ఐసిడిఎస్ సిడిపిఓ లకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు అనుబంధం ) జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్, అసోసియేషన్ల జైంట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపులో భాగంగా 2025 మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మిని టీచర్స్ పాల్గొంటారని తెలిపారు శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని,
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను పర్మెంటు పైన గుజరాత్ హైకోర్టు ఆదేశాలను, అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ పైన సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను రెగ్యులర్ చేయాలని హెల్పర్లకు 26,000 ,టీచర్లకు 32000 కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు.
నెలకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం 45 ,46 సిఫార్సుల ప్రకారం పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ మొదలైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, నిర్బంధ విద్యా వ్యవస్థకు ఈ. సి. సి. ఈ లింక్ చేయరాదన్నారు. పెన్షన్, ఎక్స్‌గ్రేషియా మరియు ఇతర సామాజిక భద్రత చర్యలు నిర్ధారించే వరకు ఉద్యోగాల నుండి తొలగించరాదన్నారు .ఏ రూపంలోనూ ఐసిడిఎస్ లో ప్రైవేటీకరణ చేయరాదని, ఐసిడిఎస్ లో కార్పొరేటు ప్రమేయం, నగదు బదిలీ, పిఎం శ్రీ పథకం, మొబైల్ అంగన్వాడి సెంటర్స్ నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఐసిడిఎస్ ని బలహీనపరిచే లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాల కోసం ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయడం పథకాల డిజిటలైజేషన్ పేరుతో ప్రజలపై నిఘ మరియు వారిని లక్ష్యంగా చేసుకోవడం కేంద్రీకృత వంటగది ప్రవేశపెట్టడం ద్వారా ప్రైవేటీకరణ మొదలైన అన్ని చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు
వేతనాలకు ఆన్లైన్ పనికి షరతులు పెట్టే
విధానాన్ని రద్దు చేయాలి .మంచి నాణ్యమైన క్యాబ్‌లు ,డేటా ప్యాక్, 5జి నెట్వర్క్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. కవిత, వనపర్తి ప్రాజెక్టు నాయకులు విజయలక్ష్మి, పద్మ, సుమిత్ర ,భాగ్య, శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, వసంత తదితరులు పాల్గొన్నారు
