TEJA NEWS

మరణించిన మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన టెన్త్ బ్యాచ్

వనపర్తి జిల్లా కేంద్రం పాత మున్సిపాలిటీ వెనకాల భగత్ సింగ్ నగర్ కాలనీకి చెందిన డి. మహేష్ నెల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న 90. 91 టెన్త్ క్లాస్ బ్యాచ్కు చెందిన మిత్రులు అంతా కలిసి 1,51, 500 జమ చేసి మహేష్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉండడంతో ముగ్గు రు ఆడపిల్లల పేరు మీద 50 వేల చొప్పున పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి డిపాజిట్ కు సంబంధించిన బుక్కులను మహేష్ భార్య డి అనిత కు సోమవారం వారి నివాసంలో అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆర్ వెంకటేష్ కే శ్రీనివాస్ ఎస్ సిద్దు చందు డిఐ కిషోర్ మోహన్ సాగర్ ఉప్పాల భాస్కర్ జగదీశ్వర్ రెడ్డి మహేష్ అంజి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు