TEJA NEWS

ఘనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కి సన్మానం

బీహార్ హమాలీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

బీహార్ హమాలీలు కలిసికట్టుగా ఉండి పనులు పూర్తి చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.

సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో బీహార్ హమాలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ని బీహార్ హమాలీలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుండి 300 మంది హమాలీలు రమేష్ ఆధ్వర్యంలో వచ్చి ఐకెపి, రైస్ మిల్లర్లు, వ్యవసాయ మార్కెట్ పనిచేయడం అభినందనీయమన్నారు.

ఇక్కడ ఉన్న హమాలీలు కూడ పోటీ తత్వంలో ముందుండి పనిచేయాలని అన్నారు.

రైతులు పండించే పంటను ఎగుమతి దిగుమతి చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలని అన్నారు. కమిషన్ దారులకు నమ్మకంగా పనిచేయాలని తెలిపారు. రైతులతో హమాలీలు కలిసిమెలిసి ఉండాలని,హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు వెంటనే తెలియపరచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాడ్గుల నవీన్, మార్కెట్ హమాలీ సంఘం మేస్త్రీ రమేష్ శర్మ, రూదల్, మనోజ్, మక్కాం తదితరులు పాల్గొన్నారు