TEJA NEWS

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని పటేల్ కుంట పార్క్ లో జరుగుతున్న సుందరి కరణ, మరియు మరమ్మత్తులో భాగంగా వాటర్ పౌండ్, మరియు వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, సీసీ కెమెరాలు మొదలగు పనులను హెచ్ఎండిఏ డిఈ రామారావు తో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు .

కార్పొరేటర్ మాట్లాడుతూ వాటర్ పౌండ్ మరియు వాకింగ్ ట్రాక్ పనులు వర్షాకాలం రాకముందే వీలైనంత తొందరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఏయి నైనా శ్రీ, ఆర్కిటెక్చర్ శ్రీలేఖ స్థానిక పటేల్ కుంట పార్క్ సభ్యులు చెన్నారావు, రవీందర్రావు, జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు