TEJA NEWS

సర్వేనెంబర్ 354 లోని ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా ఆధికారులకు అభినందనలు.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్.

       కె ఎల్ యూనివర్సిటీ కబ్జా చేసిన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని, అలాగే సర్వేనెంబర్ 354లో ఉన్నటువంటి 12ఎకరాల భూముల లో నిర్మాణమైన అక్రమ నిర్మాణాలను  నిన్న సాయంత్రం హైడ్రాధికారులు కూల్చివేసి అక్కడ ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను ఏర్పాటు చేయడాన్ని సిపిఐ కుత్బుల్లాపూర్  నియోజకవర్గ సమితి అభినందిస్తుందని ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ,అదేవిధంగా 354లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలని గత కొద్ది రోజులుగా పత్రికా విలేకరులు, కొన్ని సామాజిక సంస్థల నాయకుల తో పాటు సిపిఐ పార్టీగా ప్రభుత్వ అధికారులకు ఆ స్థలాన్ని కాపాడాలని అనేక వినతులు ఇచ్చిందని అందులో భాగంగానే నేడు హైడ్రా అధికారులు కాపాడారని ఈ ప్రభుత్వ భూములను కాపాడటానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి సిపిఐ పార్టీ అభినందనలు తెలియజేస్తున్నది, 

ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు మాట్లాడకపోవడం దారుణమని దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు కుత్బులాపూర్ నియోజకవర్గంలో పోరాటం చేస్తున్న ఒకే ఒక పార్టీ సిపిఐ మాత్రమేనని అన్నారు. హైడ్రా అధికారులు కేవలం సర్వే నెంబర్ 354లోని భూములనే కాకుండా గాజులరామారంలో సర్వేనెంబర్ 329, 342, 326, 307, లలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని కేవలం ఒక దగ్గర కాపాడి మరోచోట కాపాడకపోవడాన్ని అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. కావున ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా హైడ్రా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని పేదలను కలుపుకొని ప్రభుత్వ భూములను కాపాడుకుంటామని అది ప్రజలదే కాబట్టి ప్రజలకు చెందేలా పోరాటం చేస్తామని ఆ దిశగా ప్రజలను సమీకృతం చేసామని వారిని పోరాటాల కోసం సన్నద్ధం చేస్తున్నామని అన్నారు.
  ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు ఇప్పటికైనా మిగతా రాజకీయ పక్షాలన్నీ సిపిఐ పార్టీ చేసే పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు, అది నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.