TEJA NEWS

టెన్త్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థికి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అభినందనలు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, .

టెన్త్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందనలు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన వీరంకి శ్రీధర్ కుమారుడు వీరంకి వార్షత్ విశేష ప్రతిభ చూపి 600 మార్కులకు గానూ 597 మార్కులు సాధించాడు. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టెన్త్ టాపర్ వార్షత్ తో పాటు తల్లిదండ్రులు శ్రీధర్, చంద్రికలు బుధవారం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని ప్రత్యేకంగా కలిశారు. వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అత్యుత్తమ ప్రతిభ చూపించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.