
మునగతో చక్కని ఆరోగ్యం : భద్రాద్రి కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల
అశ్వారావుపేట: మునగ సాగుతో ఆర్థిక సాధికారత సాధించడంతోపాటు.దీనిని కూరల్లో వినియోగించడం ద్వారా పోషకాలు లభించి చక్కని ఆరోగ్యం పొందవచ్చుని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆయన మంగళవారం అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విద్యార్థులు సాగుచేస్తున్న ప్రయోగ పంటలను, విద్య పరంగా నిర్వహించే కార్య కలాపాలను పరిశీలించారు.
