TEJA NEWS
  • రావికం పాడు గ్రామంలో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో నూతన గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికీ పార్టీ కార్యాలయం ఉండటం ద్వారా కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించే వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిలవాలని తెలిపారు.