
లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన చౌదరి కృష్ణవేణి కి రూ.49,00/-, వెలుగలా పుష్పమ్మ కు రూ.60,000/-, ఈరప్ప పంచల్ రూ.60,000/-, పల్లపు రేణుక రూ.60,000/-,60,000/- ల చెక్కులు పంపిణి చేశారు..
అనంతరం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని పలు ఆహ్వానాలు వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..
— నియోజకవర్గంలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
సిఎం సహాయానిధి పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా మారిందాన్నారు..
ప్రజా ప్రభుత్వంలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు..
పేద,మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రలో మెరుగైన వైద్యం నిమిత్తం కాంగ్రెస్ ప్రభుత్వం LOC ను అందజేస్తుందన్నారు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
