TEJA NEWS

మాజీ ఎమ్మెల్యే భర్త, వైసీపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు.. 11 మందికి యావజ్జీవ కారాగారశిక్ష

కర్నూలు జిల్లా వైసీపీ నేత పత్తికొండ మాజీ ఇన్‌ఛార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం 16 మంది నిందితుల్లో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం.. 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మద్దికుంట వెంకటరెడ్డి వాదనలు వినిపించారు.

మరోవైపు కర్నూలు జిల్లా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పట్ల దివంగత నారాయణరెడ్డి భార్య పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించారు. కోర్టు తీర్పుతో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతోనైనా తనలాంటి మరో మహిళకు అన్యాయం జరగకూడదని భావిస్తున్నట్లు తెలిపారు…