
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతి కి కాప్రా ప్రెస్ క్లబ్ ఘన నివాళి
ప్రజల పక్షపాతి
రాజన్న మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన సభ్యులు.
ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఉప్పల్ నియోజకవర్గం మొట్టమొదటి శాసన సభ్యులు, బండారి రాజి రెడ్డి మృతికి కాప్రా ప్రెస్ క్లబ్ సభ్యులు ఘన నివాళులు
అర్పించారు.
ముందుగా బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎంపల్లి పద్మా రెడ్డి మాట్లాడుతూ కాప్రా మున్సిపల్ చైర్మన్గా, ఉప్పల్ నియోజవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన జననేత బండారి రాజి రెడ్డి మృతి తీరని లోటు అని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం ను ఎంతో అభివృద్ధి పరిచి, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవలు అందించారు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ కు అధ్యక్షుడు పటేల్ నరసింహులు, బెలిదె అశోక్, ఎంపల్లి పద్మా రెడ్డి, జి హరిప్రసాద్, ముఖేష్ గౌడ్, జి శ్రీనివాసరావు, వెంకట్, కీర్తి శ్రీనివాస్, యాటా రాజు, జి రోజా రాణి, వి శ్రీరామచంద్రమూర్తి, వెంకటాపురం రవి, గంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
