TEJA NEWS

రూ.5 లక్షలు కట్టాలని KA పాల్ కు హైకోర్టు సూచన

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.

ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు నిన్న విచారించింది. ఆ కేసును CBIతో విచారణ జరిపించాలని పిల్ లో పాల్ కోరారు.

ఆ వ్యాజ్యాన్ని ఆయన సదుద్దేశంతోనే దాఖలు చేశారన్న రుజువు కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ. 5లక్షలు కట్టాలని సూచించింది.

ఆ సొమ్ము చెల్లించిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.