
ఘనంగా చెన్నకేశవస్వామి మాస కళ్యాణం
సూర్యాపేట జిల్లా ప్రతినిది : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గురువారం ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి మాస కళ్యాణాన్ని అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. దేవి దేవేరులు ప్రత్యేకంగా అలంకరించి తదుపరి కళ్యాణ క్రతువు పూర్తి చేశారు.అర్చకులు మాట్లాడుతూ..సూర్యాపేట జిల్లాలో ఉత్తర ముఖం కలిగిన పురాతన ఆలయం పిల్లలమర్రిలో ఉండటం విశేషం అని అన్నారు.వైకుంఠంలో ఉత్తర ముఖం ద్వారా సాక్షాత్తు శ్రీమహా విష్ణువును ఏవిధంగా దర్శిస్తామో అదేవిధంగా ఇక్కడ ఆలయం కొలువు దేరి ఉంటుందని బావిలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గర్భాలయంలో భక్తులకు దర్శనం ఇస్తాయని అన్నారు.
కోరినా కోర్కెలు ఆరోగ్య సమస్యలకు ఇక్కడ భక్తులు ముడుపులు కట్టి తమ ఈతి బాధలను తీర్చుకుంటారని ప్రసిద్ధి.అలాయంలో స్వామి లక్ష్మీదేవితో కొలువై ఉండటం విశేషం. భక్తులకు ఆర్థిక పరమైన బాధల నివారణ కొరకు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి తదుపరి కుంకుమార్చన నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అలాయంలో ప్రతి నేల ఏకాదశి రోజున కళ్యాణం, రోహిణి నక్షత్రం రోజున పంచామృత అభిషేకం,శుక్రవారం పుష్పాలంకరణ ,రెండవ శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సహిత ఊంజల్ సేవ,మూడవ ఆదివారం శ్రీ సుదర్శన నారసింహ సహిత చెన్నకేశవ స్వామి హోమం భక్తుల సహకారంతో నిర్వహిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ గుకంటి రాజబాబు రెడ్డి,ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్,భక్తులు ముడుంభై సారిక, గవ్వ విజయ లక్ష్మీ,అంకం భిక్షం మల్లీశ్వరి, గవ్వ అహల్య, మెరెడ్డి సువర్ణ,తదితరులు పాల్గొన్నారు..
