
కార్పొరేట్ స్థాయి వైద్యం కోదాడ కు అందుబాటులోకి తేవడం అభినందనీయం…
కోదాడ సూర్యాపేట జిల్లా)
వైద్యశాలలు వ్యాపార దృక్పథంతో కాక సేవా దృక్పథంతో వ్యవహరించాలి
పేదలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందించాలి
మెరుగైన వైద్య సేవలు అందించి ఎస్వీఎస్ వైద్యశాల పేరు తెచ్చుకోవాలి….. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
నగరాలకే పరిమితమైన కార్పొరేట్ స్థాయి వైద్యం కోదాడ కు అందుబాటులోకి తేవడం అభినందనీయమని రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో ఫ్లై ఓవర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోదాడ హుజూర్నగర్ ప్రాంత ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు పూర్తి వ్యాపార దృక్పథంతో కాకుండా వైద్యులు సేవా దృక్పథంతో పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రజలకు విద్య వైద్యం అత్యంత ఆవశ్యకమని కోదాడలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ప్రశంసనీయమన్నారు. అభివృద్ధికి చెందిన అంశాలపై తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు.
వైద్యశాలలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వైద్య సేవల వివరాలను నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ రావూరు మంత్రికి వివరించారు. అనంతరం డాక్టర్ శివప్రసాద్ రావూరు మాట్లాడుతూ వైద్యశాలలో హైదరాబాద్ వంటి నగరాలకు దీటుగా గుండె ఊపిరితిత్తులు మెదడు నరాలు మూత్రపిండా వ్యాధులు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతి విభాగానికి అనుభావాజ్ఞులైన వైద్యులు వైద్య పరికరాలు వ్యాధి పరిశోధక యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్యశాల అన్నివేళలా అందుబాటులో ఉంటుందన్నారు అనంతరం వైద్యశాల యాజమాన్యం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ రావూరు శివప్రసాద్, డాక్టర్ నరేందర్ ఎస్ వి ఎస్ హాస్పిటల్ వైద్యుల బృందం, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, కోదాడ హుజూర్నగర్ ఐఎంఏ వైద్యులు కోదాడ హుజూర్నగర్ పట్టణాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
