
మాజీ సర్పంచ్ మానం గురవయ్యను పరామర్శించిన దారపనేని
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్, తూర్పు కోడిగుడ్లపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మానం గురవయ్యను కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పరామర్శించారు. ఇటీవల కొంత అస్వస్థతకు గురైన గురవయ్య విజయవాడలోని కార్పొరేట్ వైద్యశాలలో మెరుగైన వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. దారపనేని, మానం గురవయ్య స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి పై సమాచారం అడిగి తెలుసుకుని ఆరోగ్యంపై అశ్రద్ధ విడనాడి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలని సూచించారు.మిరియం సుబ్బరాయుడు, దారపనేని నరసింహారావు, మానం వెంగళరావు, బొడ్డు రవి, నాగం నాగరాజు తదితరులు మానం గురవయ్యను పరామర్శించిన వారిలో ఉన్నారు.
