
గురజాల నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరి మణులను ఘనం గా సన్మానించిన ఎమ్మెల్యే యరపతినేని
దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల విజయ భాస్కర్ కళ్యాణ మండపం నందు గురజాల నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ , రాష్ట్ర హాజ్ కమిటీ చైర్మన్ లు పాల్గొన్నారు. ముందుగా వారు గురజాల నియోజకవర్గ పరిధిలో హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదర , సోదరీమణులను వారు ఘనంగా సన్మానించి , సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే. యరపతినేని. శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు పార్టీలతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి సొంత నిధులు లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తున్నామని వారు తెలిపారు.2014 – 2019 మధ్య నియోజకవర్గ పరిధిలో 40 కుటుంబాలకు ఇచ్చి హజ్ యాత్రకు పంపామని , 2019 లో ఏర్పడిన వైకాపా ప్రభుత్వం ముస్లింలను అన్ని రకాలుగా దాడులు చేసి ఎన్నో అక్రమ కేసులు బనాయించారని అన్నారు.ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టామని అన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
