TEJA NEWS

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20% మాత్రమే. దినపత్రికలు సైతం చదివే అక్షరాస్యులు 20% లోపే అయినప్పటికీ అప్పటి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు వినియోగించుకున్నారు. ఇన్ని వసతులు ఇంత సాంకేతికత, రహదారుల వసతి లేనప్పటికీ అప్పటి కాలంలో నేటి ఓటర్లతో పోల్చుకుంటే అప్పటి ఓటర్లే ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆనాటి కాలంలో ఓటర్లు అందరూ ఓటుకు ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండానే స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. నోటు ఇస్తే కాని ఓటు వేయమని అంటున్నటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటింది అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించాం సాంకేతిక పరంగా కూడా చాలా అభివృద్ధి సాధించాం 20 శాతం ఉన్నటువంటి అక్షరాస్యత నేడు 87 శాతానికి పెరిగింది వాస్తవంగా అక్షరాస్యత పెరిగేకొద్దీ ఓటింగ్ శాతం కూడా పెరగాలి అదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని ఆశించాం ఓటు ప్రాముఖ్యత గురించి అనేక ప్రసారాలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఓటింగ్ శాతం పెరుగుదల నామమాత్రం గానే ఉంటుంది గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉండడం ఆశ్చర్యకరం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతంలో అక్షరాస్యత చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా ఓటింగ్ శాతంకు వచ్చేసరికి పట్టణ, ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటుంది మరి అక్షరాస్యత ఉండి కూడా ఓటింగ్ లో పాల్గొనకపోవడం ఎలా భావించాలి. హైదరాబాదు లాంటి పెద్ద పట్టణాల్లో 40 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరగడం లేదు అంటే 60 శాతం మంది ఓటుకు దూరంగానే ఉంటున్నారు ఇది చాలా విచారించదగ్గ విషయం. ప్రజాస్వామ్యానికి సుపరిపాలనకు దిక్సూచిలాంటి విలువైన ఓటును పట్టణాలలో 60 శాతం మంది కూడా ఓటును వినియోగించుకోలేకపోవడం అందుకు కారణాలు వెతకాల్సిన అవసరం ఉంది 90% పైగా ఓటింగ్ పెరగకపోతే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అన్న సుపరిపాలన రావాలి అన్నా మంచి పాలకులు రావాలన్నా ఓటింగ్ శాతం 90% పైగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది 77 సంవత్సరాల కాలంలో స్వతంత్రానంతం ఏ ఒక్క సారి కూడా ఈ ఓటింగ్ శాతం నమోదు కాలేదు మంచి పాలకులు రావాలంటే దేశాభివృద్ధి ద్యేయంగా అవినీతి రహితమైన ప్రభుత్వాలు రావాలి అంటే అది నిర్ణయించాల్సింది ఓటర్లే కదా సుమారు 35 శాతం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నప్పుడు మంచి పాలకులు ఎలా వస్తారు. మంచి ప్రభుత్వం ఎలా వస్తుంది. అక్షరాస్యుల కంటే అక్షరాస్యత తక్కువగా ఉన్న గ్రామవాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం ఓటింగ్ కు దూరంగా ఉన్నవారు ఎక్కువ శాతం అక్షరాసులే విద్య, విజ్ఞానం ఉన్నవారు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నప్పుడే మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి ఓటింగ్ శాతం 65% కంటే మించకపోవడానికి కారణాలు ఏమిటి? వాటిని కూడా మనం ఒకసారి పరిశీలించాలి కొంతమందికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలో ఉన్న వారి పనితీరులో పెద్దగా మార్పులు ఏమి ఉండవు అన్న భావన చాలామందిలో ఉంది అది కూడా ఓటింగ్ దూరంగా ఉండడానికి ఒక కారణమే అధికారంలో లేనప్పుడు చెప్పేది ఒకటి అధికారం చేపట్టాక చేసేది మరొకటి అన్న భావన కూడా ఓటర్లలో ఉంది గంటలు గంటలు వరుస క్రమంలో నిలబడి ఓటు వేసే ఓపిక లేకపోవడం. నేను ఓటు వేయకపోతే ఏమిటి నష్టం అనే భావన కూడా ఉంది ఎన్నికల సమయంలో మద్యం నోట్ల కట్టలు పంచుతున్నారు అవి అందనివారు కూడా ఓటుకు దూరంగా ఉంటున్నారు ఓటు వేయకపోతే నాకేంటి నష్టం అనే భావన ఉంది. అక్షరాస్యత ఉన్నప్పటికీ సామాజిక భావన లేకపోవడం ఓటు విలువని గుర్తించకపోవడం సుధీరప్రాంతాలకు వెళ్లి ఓటును వినియోగించుకోవాల్సిన రావడం ఓటింగ్ ఈవీఎంలు త్వరగా ఓటును తీసుకోకపోవడం వలన ఓటింగ్ ఆలస్యం అవుతున్నది అంత సమయమును ఓటు కోసం వినియోగించే ఓపిక లేకపోవడం అనేక కారణాలు ఉన్నాయి.
ఓటింగ్ శాతాన్ని 90% పైగా పెంచాలి అంటే మరి ఏం చేయాలి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక పూర్తిగా అమలుపరిచేలా చూడాలి సాధ్యం కానీ అమలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించాలి పోలింగ్ బూతులు ఈవీఎంల సంఖ్య పెంచాలి ఒక్క నిమిషంలో నలుగురు ఓటు వేసేలా ఉండాలి రహదారులు లేని గ్రామాలకు రహదారులు నిర్మించాలి ఇతర జిల్లాలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాలను అంటే దూరం ఉన్నటువంటి ప్రాంతంలో వారికి పోస్టల్ ఓటింగ్ లేదా ఆన్లైన్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశాన్ని సౌకర్యాన్ని కల్పించాలి. ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలు కార్యాలయాలు వారి సిబ్బందిని అందరినీ ఓటింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఎన్నికల కమిషన్ ఎంత ప్రయత్నం చేసినా మద్యం డబ్బుల పంపిణీ జరగకుండా ఆపలేకపోతున్నారు వీటిని పూర్తిగా నిరోధించినప్పుడే మంచి నాయకులు, విద్యావంతులు , యువకులు, సమాజసేవకులు రాజకీయాల్లోకి వస్తారు ఎన్నికలు నేడు చాలా ఖరీదుగా మారిపోయాయి తద్వారా సామాన్యులు నిస్వార్థపరులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు దాని ద్వారా బాగా డబ్బున్న వాళ్ళు వ్యాపారవేత్తలు విద్య ఫార్మసీ రియల్ ఎస్టేట్ బడా వ్యాపారవేత్తలే చట్టసభల్లోకి వెళ్ళగలుగుతున్నారు. మధ్యతరగతి వారికి ఆ అవకాశం లేకుండా పోయింది వీటన్నిటిని నిరోధించగలిగితే ఓటింగ్ శాతం 90 శాతం పెరుగుతుంది. చివరి హస్తంగా ప్రధానమైన కారణం లేకుండా ఓటు వేయని వారిపై కొంతమంది చర్యలు తీసుకునే చట్టాలను రూపొందించాలి కొన్ని దేశాలలో ఇది అమలు పరుస్తున్నారు కూడా అమెరికా, జర్మనీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇరాన్, గోవా, ఇంగ్లాండ్ లాంటి కొన్ని దేశాలలో సరైన కారణము చూపకుండా ఓటింగ్ లో పాల్గొనని వారికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అందువల్ల అక్కడ 90 నుంచి 98 శాతం దాకా ఓటింగ్ నమోదు అవుతుంది అదేవిధంగా ఆయా దేశాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనదేశంలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడానికి ఒక ఉన్నత కమిటీని వేసి పరిశీలించి మనదేశంలో కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం సరైన కారణం లేకుండా ఓటు వేయని వారిపై మన దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సంక్షేమ పథకాలను కొంతకాలం మేరకు నిలిపివేయాలి ఉదాహరణకి రేషన్ సరుకులు పెన్షన్లు రైతుబంధు ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణ లాంటివి ఓటింగ్ లో పాల్గొన్నటువంటి వారికి కొంతకాలం నిలిపివేయాలి ఉద్యోగులు అయితే ఒక నెల వేతనంలో కొంతమేర కోత విధించడం ఇంక్రిమెంట్లు , ప్రమోషన్లు కొంత కాలం వరకు నిలిపివేయడం లేదా కొన్ని సంవత్సరాల పాటు ఓటింగ్ లో పాల్గొనకుండా ఓటును రద్దు చేయడం ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఒక ఉన్నత కమిటీని వేసి చర్యలకు పూనుకుంటే తప్పకుండా మన దేశంలో ఓటింగ్ శాతం 90% కంటే ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పాలి కావున అన్ని పార్టీలతో అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఒప్పించి పార్టీల వ్యతిరేక విధానాల జోలికి పోకుండా దేశ భవిష్యత్తు దృష్ట్యా అన్ని దేశాల్లోనూ మన దేశంలోని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాంటి చట్టాన్ని తీసుకువచ్చినప్పుడే ఓటింగ్ శాతం పెరుగుతుంది మంచి ప్రభుత్వాలు వస్తాయి ఎన్నికలు వచ్చిన ఓటింగ్ శాతం పెరగడం అనేది నామమాత్రంగానే ఉంటుంది ఈ చర్యల వల్ల కచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓటును వినియోగించకపోతే ఎలాంటి శిక్షలు వేయాలో చర్చించి అమలు చేయడం తప్ప మరో మార్గం లేదు అన్నది జగమెరిగిన సత్యం అలా చేయకుండా ఓటింగ్ శాతం పెరగడం అనేది అసాధ్యమే ఒకసారి ఆలోచించండి.


TEJA NEWS