దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్

దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్

TEJA NEWS

దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గా ల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టున్నారు.

ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దు ల్లా తలపడుతున్నారు.

మొత్తం 695 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ఈసీఐ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది.

ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 7 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఝార్ఖండ్‌లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో చెరో సీటుకు ఎన్నికలు జరగనున్నాయి…

Print Friendly, PDF & Email

TEJA NEWS