
విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు ఎంచుకోవాలి
అధ్యాపకులు, సౌకర్యాలు ఉన్న కళాశాలలో చేరాలని సూచన
తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా కార్యదర్శి కేదార్నాథ్
వనపర్తి
పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో చేరాలని
మీరు ఎంచుకున్న సబ్జెక్టు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని
టీజీవీపీ వనపర్తి జిల్లా కార్యదర్శి ఉడుత కేదార్నాథ్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఆధ్యాపక బృందం, వసతి సౌకర్యాలు ,హాస్టల్ సౌకర్యాలు పరిశీలించిన పిదప కళాశాలల్లో చేరాలని, అసౌకర్యాలు ఉన్నటువంటి కళాశాలలో చేరి వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు విద్యార్థుల సలహాల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ హెల్ప్ లైన్ నెంబర్లు అయిన 7386820819,9959395310 లకు ఫోన్ చేసినట్లయితే సలహాలు ఇస్తామని అన్నారు.
