TEJA NEWS

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ని తహసీల్దార్ స్థాయికి డిమోషన్

కుటుంబం రోడ్డున పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ వ్యాఖ్యలు

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న తాతా మోహన్ రావు.. 2013లో తహసీల్దార్‌గా పని చేసినప్పుడు హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడులో గుడిసెలను ఖాళీ చేయించాడు

దీంతో ఆగ్రహించిన హైకోర్టు, కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు మోహన్ రావుకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పునిచ్చింది

ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు

దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి గుడిసెలను తొలగించి.. అందులో నివాసం ఉంటున్న వారిని రోడ్డు మీదికి తోసేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

మోహన్ రావును జైలుకు పంపితే ఆయన ఉద్యోగం పోతుంది. ఆయన మొండితనం, నిర్లక్ష్య వైఖరి వల్ల కుటుంబసభ్యులు రోడ్డున పడతారు. పిల్లల చదువులు పాడైపోతాయని..

మోహన్ రావును ప్రస్తుతం ఉన్న డిప్యూటీ కలెక్టర్ స్థానం నుండి నుంచి తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని సుప్రీంకోర్టు జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు