
అవినీతి నిరోధక శాఖకు చిక్కిన లంచగొండి అధికారి
రాజన్న జిల్లా :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసీబీ వలకు చిక్కాడు. ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డా డు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) గా విధులు నిర్వహిస్తున్న అమరేందర్ రెడ్డి….
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపా యల లంచం డిమాండ్ చేయగా, 75 వేలకు కుదిరింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యారణ్యపురి కాలనీలో నివాసం ఉంటున్న తన ఇంట్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు రవీందర్ వద్ద 60 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు అమరేందర్ రెడ్డి,ని రెడ్ హండ్రెడ్ గాపట్టుకున్నారు.
అంతేకాకుండా గతంలోనూ ఇదే కాంట్రాక్టర్ వద్ద సుమారు నాలుగు లక్షల వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం. ఈ అధికారి చాలా మంది కాంట్రాక్టర్ల వద్ద అధిక మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పి వివరించారు.
