
రేపు అధికార లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు
హైదరాబాద్:
పాకిస్తాన్ కాల్పులతో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళి నాయక్ భౌతికకాయం ఈ రోజు స్వగ్రామం చేరుకోనుంది. మురళి నాయక్,స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్ళి తాండ. ఆ గ్రామానికి ఈ రోజు రాత్రి 10 గంటలకు మురళి భౌతి కకాయం చేరుకోనుంది.
రాత్రి 7 గంటలకు గుమ్మయగారిపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియ లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మురళి నాయక్ చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.
అధికారిక, సైనిక లాంఛ నాలతో రేపు మధ్యాహ్నం మురళి నాయక్ అంత్య క్రియలు నిర్వహించను న్నారు.
