TEJA NEWS

కూటమి ప్రభుత్వం నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్
పిడుగురాళ్ల
సైప్రెస్ కంట్రీలో కారు ప్రమాదంలో మృతి చెందిన గురజాల పట్టణానికి చెందిన నల్ల నవీన్ పార్థివ దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కోరారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు గురజాల పట్టణానికి చెందిన నల్ల పేరయ్య కుమారుడు నల్ల నవీన్ సైప్రెస్ కంట్రీ కి వెళ్ళాడు . అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నవీను ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు ఇటువంటి రైతు కుటుంబానికి చెందిన విద్యార్థుల పట్ల కోటవి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని తెలిపారు. గత 18 నెలలు నుంచి ఈ ప్రాంతంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో నవీన్ మృతి చెందడం జరిగింది . ఇటువంటి ఉన్నత విద్య చదివే విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. తమ కుమారుడు మృతి చెందిన వార్త విన్న తల్లిదండ్రులు బంధువులు శోకసముద్రంలో మునిగారు. నవీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.