TEJA NEWS

టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి..

14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణాన్ని ఆస్వాదించినట్లు కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

టెస్ట్ ఫార్మాట్ తనను పరీక్షించిందని మరియు ఉత్తమ క్రికెటర్ గా ఎదగడానికి సహాయపడిందని కోహ్లి పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లి తన కెరీర్లో 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు.

అతని టెస్ట్ కెరీర్లో 30 సెంచరీలు మరియు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇప్పటికే T20Iల నుండి రిటైర్ అయిన కోహ్లి, ఇకపై వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్లో కొనసాగుతాడు.