
అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టు పార్టీ.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ని జగత్గిరిగుట్ట డివిజన్ బీరప్ప నగర్ మరియు లెనిన్ నగర్ శాఖల మహాసభలు శాఖ కార్యదర్శి హరినాథ్ రావు, సాయిలు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలను నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ఆనవాయితీగా జరుగుతుందని ఈ మహాసభలకు గత మూడు సంవత్సరాల నుండి నాయకత్వం చేసిన కార్యక్రమాలు సమీక్షించుకొని రాబోవు మూడు సంవత్సరాల కాలంలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలను నిర్ణయించుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేనప్పటికీ ఇల్లు లేని నిరుపేదలకు లక్షల ఎకరాల పంచిన చరిత్ర ఉందని ఇంతటి చరిత్ర ఈ రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీకి లేదని అన్నారు,
ప్రజల అవసరాలైనటువంటి భూమి విద్య ఉపాధి గురించి మాట్లాడకుండా బూర్జువా వర్గాల ప్రతినిధులు అయినటువంటి పార్టీలు కులం, మతం పేరు తో ప్రజల మధ్య చర్చలు తీసుకొస్తుందని, ప్రజలు ఆలోచించకుండా రాజకీయ నాయకులు డబ్బులు మద్యం పంచి రాజకీయాలను కలుషితం చేశాయని, సిపిఐ పార్టీ మాత్రం డబ్బులు మద్యం పంచకుండా నీతిగా రాజకీయాలు చేస్తుందని, బూర్జువా పార్టీలు డబ్బులు మద్యం మొత్తం కులం లేకుండా రాజకీయాలు చేయలేవని అన్నారు. యువకులు బిజెపి ఆర్ఎస్ఎస్ లు చేసే మతోన్మాద రాజకీయాల ఉచ్చులో పడవద్దని, పేద ప్రజలకు భూమి, విద్య, వైద్యం, ఉపాధి కొరకు ఉద్యమించే పార్టీలకు మద్దతు తెలుపాలని కోరారు.
ఈ సమావేశంలో మహిళా సమితి జిల్లా అధ్యక్షురాలు హైమావతి, పార్టీ నియోజకవర్గ కోశాధికారి సదానంద, దక్షిణామూర్తి, శ్రీనివాస్, లక్ష్మి, కమలమ్మ, వీరస్వామి, రామ్ రెడ్డి, జంబు, మోహన్, సంపత్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
బీరప్ప నగర్ శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ చారి, సహాయ కార్యదర్శులుగా దక్షిణామూర్తి,శీను లెనిన్ నగర్ శాఖ కార్యదర్శిగా ఎండి యూసుఫ్, సహాయ కార్యదర్శిగా సంపత్లను ఎన్నుకోవడం జరిగింది.
