TEJA NEWS

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్:
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి, భేటీ అయ్యా రు. ఇవాళ మంత్రి శ్రీధర్‌ బాబుతో పాటు హైదరా బాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త తల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థి తులు, తెలంగాణలో భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పెండింగ్ పడుతూ వస్తున్న నేపథ్యం లో ఈ భేటీ రాజకీయం గానూ ఉత్కంఠగా మారింది.