TEJA NEWS

బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన “ఎలైట్ కౌంటీ” నూతన సంక్షేమ సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని షాపూర్ నగర్ టీఎస్ఐఐసీ”ఎలైట్ కౌంటీ” అపార్ట్ మెంట్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. నూతన సంక్షేమ సంఘ కార్యవర్గానికి నా అభినందనలు. అపార్ట్మెంట్ వాసులు కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి
సమస్యల పరిష్కారానికై కృషిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నూతన అధ్యక్షులు మహమ్మద్ సిద్దిక్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రెటరీ పిల్లి శంకర్, కోశాధికారి నరేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి కృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రషీదుల్లా ఖాన్, సతీష్, రవీంద్రనాథ్, నాగ తేజ, ఎం.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.