
ఆధునిక టెక్నాలజీలతో రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంది
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి
వనపర్తి
,క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గోపాల్ పేట్ మండలం మున్ననూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగాపాల్గొనడం జరిగింది.
మాట్లాడుతూ
వ్యవసాయ రంగంలో ఆధునిక పనిముట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. కూలీల కొరత ఇబ్బందులతో పాటు శ్రమ ,పెట్టుబడితగ్గించడంలో ఆధునిక పనిముట్లు, యంత్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
నాటడం, కలుపు తీయడం ,మందుల పిచికారి, ఎరువులు అందించడం, నీటిపారుదల, రవాణా, పంట కోతలు, నూర్పిడి వంటి ముఖ్యమైనపనుల్లో కొత్తగా మార్కెట్లోకి వస్తున్న వివిధ పనిముట్ల ,యంత్రాలను రైతులకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన మొదటి వర్షాకాలం పంట కాలంలో మునుపెన్నడు లేని విధంగా 66 లక్షల ఎకరాలలో 153 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించగలిగినామని అన్నారు.
పండించిన వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొన్నదని అందులో సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇచ్చిందని అన్నారు
. ప్రజా ప్రభుత్వం ఒక వ్యవసాయ రంగం పై మాత్రమే 54 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిందని అన్నారు
ప్రజా ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అందులో భాగమే రెండు లక్షల రుణమాఫీని 21 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశామని అన్నారు
వ్యవసాయ పనిముట్లు,యంత్రాలపై గత కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీలపై యంత్రాలను రైతులకు అందించేవారు. కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంబంధించిన యంత్రాలపై ఎలాంటి సబ్సిడీ ఇవ్వకుండా రైతులకు నష్టం చేసిందని అన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఖర్చులు తగ్గుదల ,సమయం ఆదా, వేగవంతంగా పనులు పూర్తి కావడం ,సాగు విస్తీర్ణం పెరుగుదల, ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల వంటి అంశాలలో సాధిస్తున్న ప్రగతి గూర్చి మా రైతులకు అండగా ఉండాలని కోరడం జరిగింది.
నేడు మార్కెట్లో సేంద్రీయ పంటలకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపాలని కోరారు
రైతులు ఒక వరి పంటను పండించకుండా వివిధ రకాల పంటలు పండించి మంచి లాభాలు పొందాలని అన్నారు.
రైతులు అత్యాధునిక వ్యవసాయ పనిముట్లను వాడి లాభదాయకంగా లబ్ధి పొందాలని సూచించారు.
విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి శాలువలు కప్పి సన్మానించడం జరిగింది
వ్యవసాయంలో రసాయనిక ఎరువులను తగ్గించి పంటలను ఏ విధంగా పండించాలే అనే అంశంపై రైతులకు శాస్త్రవేత్తలు విన్నవించారు.
కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు , గోపాల్ పేట్ సింగల్ విండో అధ్యక్షుడు రఘు,గ్రామ మాజీ సర్పంచ్ శేఖర్, గ్రామ రైతులు, గ్రామకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిరమల్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, సత్యం, రాములు, రమేష్ , అంజి,నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.
