Spread the love

దని లోన్ యాప్ ల ద్వారా రెండు కోట్లు కాజేసిన సైబర్ నేరస్తుల ముఠా నిందితుడి పట్టివేత
4 లక్షల నగదు ఆర్ సెల్ ఫోన్లు రికవరీ………….జిల్లా ఎస్పీ వెల్లడి
ప్రభుత్వ గుర్తింపు రిజిస్ట్రేషన్ పర్మిషన్ లేని చిన్న చిన్న చిట్స్ లలో చేరి మోసపోవద్దని సూచన
….

వనపర్తి :
ధని లోన్ యాప్ ల ద్వారా రెండు కోట్లు కాజేసిన సైబర్ నేరస్థుల ముఠా కీలక నిందితుడిని అరెస్టు చేసి వారి నుండి నాలుగు లక్షల నగదును ఆర్ సెల్ ఫోన్ లను రికవరీ స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు పంపినట్లు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ మేరకు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని గోపాల్పేట మండలం పోల్కేపాడు గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు బోయ శివుడు తన బామ్మర్ది మండ్ల వెంకటేష్ కు దని సర్వీసెస్లో లోన్ పొందేందుకు అర్హత సాధించారని తన ఫోన్ నెంబర్ కు గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మీరు దని యాప్ లో ను పొందేందుకు అర్హత సాధించారని మీకు లోన్ అవసరం ఉందా లేదా అని అడగగా వెంకటేష్అవసరమై అని తెలుపగా అవతల వ్యక్తి లోన్ కావాలంటే ముందుగా జిఎస్టి ఇన్సూరెన్స్ టిడిఎస్ అలాగే ప్రాసెసింగ్ చార్జీలు ముందుగానే కట్టవలసి ఉంటుందని తెలుపగా వెంకటేష్ తన బామ్మర్ది శివుడు అకౌంట్ ద్వారా ఆరుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు పంపిన క్యూడర్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా 32,135 వేలను పంపించడం జరిగిందని అయినా ఇంకా డబ్బులు పంపమని అడుగుతుండడంతో అనుమానం వచ్చి సైబర్ పోర్టల్ 19 30 కి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపి సైబర్ నేరస్తుల ద్వారా మోసపోయినట్లు తెలియ చేసి గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు అండర్ సెక్షన్ 318,(4)BNS సెక్షన్ 66 DIT యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ డిజిపి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆధ్వర్యంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది జిల్లా పోలీస్ సిబ్బంది ఉమ్మడిగా దర్యాప్తు చేపట్టడం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా దని యాప్ సైబర్ నేరస్తులు 55 మందిని గుర్తించడం జరిగిందని అందులో ముగ్గురిని మూడవత్ నరేష్ నాయక్, కండియా నాయక్ మూడవత్ చందు నాయక్ లను సూర్తి తండాలో అదుపులోకి తీసుకోగా మిగతావారు పరారీలో ఉన్నారని అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా తమ తాండ కనకాపూర్ తాండలకు చెందిన వాళ్లతో కలిసి ఒక టీం గా ఏర్పడి కోల్కత్తా ఢిల్లీ మరియు పాట్నాల లో ఉంటున్న బీహార్ రాష్ట్రానికి చెందిన పంకజ్ కుమార్ యాదవ్ గురూజీ రాహుల్ పాశ్వాన్ దీపక్ కుమార్ సునీల్ కుమార్ శంభు కార్తీక్ మరియు కుశ వాహ వీరంతా వారి సహచరులు అని సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తున్నారని సంపాదించిన డబ్బును జల్సాలకు వాడుకుంటున్నారని వీరి ఇప్పటివరకు సైబర్ నేరాలుచేసి కమిషన్ రూపంలో ఇప్పటివరకు దాదాపుగా పది లక్షల రూపాయలు సంపాదించినట్లు అందులో నాలుగు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మిగతా డబ్బులను సొంత అవసరాలకు ఖర్చు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త యాప్ల ద్వారా ఇలాగే మోసం చేస్తుంటారని ప్రజలు ఇలాంటి సైబర్ మోసాలకు గురి కావద్దని అలాగే రిజిస్ట్రేషన్ పర్మిషన్ లేని చిట్ ఫండ్స్ లో చిట్స్ వేసి మోసపోవద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి రత్నం అనపర్తి డి సి ఆర్ పి డి ఎస్ పి ఉమామహేశ్వరరావు వనపర్తి సిఐ కృష్ణయ్య సైబర్ క్రైమ్ ఎస్ఐ రవి ప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
[16:20, 13/02/2025] Manju Latha Reddy: …