
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
అమరావతి : దేశంలో తొలిసారిగా లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రినాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే ఒంటరి మహిళలు మాదిరిగానే ఒంటరి పురుషులకూ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 1,46,21,223 రేషన్ కార్డులు ఉండగా, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వాటి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. కార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లక్కర్లేదని, వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని నాదెండ్ల కోరారు.
