
ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునికీకరణ పనులకుశంకుస్థాపన
రూ.20 లక్షల వ్యయంతో ఆధునికీకరణ పనులు
శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్
ఎన్టీఆర్ విగ్రహం చూస్తేనే స్ఫూర్తి, ప్రేరణ పొందుతాం
విజయవాడ : ప్రజా సంక్షేమ పథకాలకు ఆధ్యుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తేనే యువతతో పాటు తాము కూడా ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను పొందుతామని అన్నారు.
మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ ను రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన జరిగింది. విజయ వాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని అన్నారు. నందమూరి తారక రామారావు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మకుటం లేని మహారాజుగా వెలుగొందారని అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని సైతం గడగడ లాడించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేలా చేశారని అన్నారు.ఎంతో మంది ప్రధాన మంత్రుల నియామకంలో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా ఎన్టీఆర్ విగ్రహం లేని ప్రాంతం లేదని అన్నారు. అలాంటి మహానుభావుడిని మనం అందరం గౌరవించుకోవాలని అన్నారు. 20 సంవత్సరాల క్రితం పటమట ఎన్టీఆర్ సర్కిల్లో నిర్మాణం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ సర్కిల్ ను ఆధునికీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నిర్ణయించారని అన్నారు. అందులో భాగంగా ఇప్పుడు రూ.20 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ సర్కిల్ ను పూర్తిస్థాయిలో ఆధునికీకరణ పనులను చేపట్టామన్నారు. విజయవాడ నగరంలో ఒక సుందరమైన ప్రాంతంగా ఎన్టీఆర్ సర్కిల్ ను తీర్తిదిద్దుతామని ఎంపీ కేశినేని శివనాధ్ అన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్ అని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీ ఆర్ అని అన్నారు. 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పటమట ఎన్టీఆర్ సర్కిల్ ను ఆధునికికరణ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఆ పనులను ఇప్పుడు ఎంపీ కేశినేని శివనాధ్ చేతుల మీదగాప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం చూస్తేనే తమకు స్ఫూర్తి, ప్రేరణ కలుగుతాయని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, ఫించను పథకాలను ఇప్పుడు దేశం మొత్తం అమలు చేస్తున్నాయని అన్నారు. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని పటమట ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఆధునికీకరణ పనులు ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నర్రా కిషోర్ చెన్నుపాటి గాంధీ, షేక్ ఫిరోజ్, కార్పొరేటర్లుముమ్మినేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరు సాయిబాబా, పేరిపి ఈశ్వర్, అడపా నాగేంద్ర, సోంగా సంజయ్ వర్మ,శివలక్ష్మి,
శిరీష గాంధీ, సూర్య కుమారి పలువురు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
