TEJA NEWS

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన టిడిపి కొటిక‌ల‌పూడి గ్రామ నూత‌న కార్య‌వ‌ర్గం

టిడిపి గ్రామ అధ్య‌క్షుడు గా అర్జా సుధాకర్ సుధాక‌ర్ ఎన్నిక‌

నూత‌న కార్య‌వ‌ర్గానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు

విజ‌య‌వాడ : మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లంలోని కొటిక‌లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా నూత‌నంగా ఎంపికైన అర్జా సుధాకర్ సుధాక‌ర్ తోపాటు, నూత‌నంగా ఎంపికైన పార్టీ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి గ్రామ పార్టీలో నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా త‌మ‌కి అవ‌కాశం క‌ల్పించినందుకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కొటిక‌ల‌పూడి గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడిగా ఎంపికైన అజ్జా సుధాక‌ర్ కు అభినంద‌న‌లు తెలప‌టంతో పాటు శాలువాతో స‌త్క‌రించి పుష్ప‌గుచ్ఛం అందించారు.ఉపాధ్య‌క్షుడుగా ఎన్నికైన కొలాకాని తిరుప‌తి రావు, సెక్ర‌ట‌రీ గండ్రాల కిషోర్ తోపాటు ఇత‌ర కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కి ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు.
ఈకార్య‌క్ర‌మంలో మాజీ ప్రెసిడెంట్ మ‌ల్లేటి రామారావు, వైస్ ఎంపీపీ బండి వెంక‌టేశ్వ‌రరావు, టిడిపి గ్రామ సీనియ‌ర్ నాయ‌కులు నాగేశ్వ‌ర‌రావు, వెంక‌టేశ్వ‌ర‌రావు, వీర్ల వెంక‌య్య‌, శ్రీనివాస‌రావుల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.