
సీడ్ కంపెనీలకు మంత్రి సీతక్క హెచ్చరిక
రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం
హైదరాబాదులోని అగ్రికల్చర్ డైరెక్టరేట్ కార్యాలయంలో విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. వాజేడు, వెంకటాపూర్ మండలాలతో పాటు కన్నాయిగుడెంలో
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ పక్షంలో కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి, క్రిమినల్ చర్యలు చేపడుతామని హెచ్చరించారు. విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ దివాకరా, పలువురు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు సీడ్ కంపెనీల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసి.. నకిలీ విత్తనాలతో నష్టపోయిన పంటలను, రైతులను వివరాలను సేకరించి అనుగుణంగా రైతులకు కంపెనీల ద్వారా నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే సహించేది లేదని.. క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో వేస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు.
