TEJA NEWS

ప్రజలకు శాంతిభద్రతలు కల్పించే విషయంలో పోలీస్ లకు పూర్తి సహకారం అందిస్తా ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి

  శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ గా వనపర్తి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచేందుకు పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్తానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.
శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద పాత భవనానికి  రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి జిల కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
   ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు బాగుండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.  శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి ఈరోజు పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. 
   వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  
 జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు  సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు.
  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ,   డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి  అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.  అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.
   జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.  ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని హామీనిచ్చారు.  ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతి భద్రతల విషయంలో తన పోలీస్ అధికారులు ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తారని కొనియాడారు. 

పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, శాసన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.