
జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మేయర్
తిరుపతి: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ కెన్సస్ లో శనివారం వారాహి జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వారాహి జ్యువలరీ బంగారం, డైమండ్, కుందన్ అభరణాలు అమ్మకాలతో పాటు ప్రదర్శన చేపట్టడం నగరవాసులకు సంతోషం అన్నారు. రెండు రోజులు , ఆదివారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో షోరూమ్ కలిగి ఉన్న వీళ్లు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఎగ్జిబిషన్ లో ఏర్పాటుచేసిన ఆభరణాలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలిపారు. వారాహి జ్యువలరీ నిర్వాహకులు మాట్లాడుతూ బ్రాండెడ్ తో చిన్న కలెక్షన్ నుంచి పెద్ద కలెక్షన్ వరకు అందుబాటులో ఉన్నాయని, బంగారం ధరపై 150 రూపాయలు తగ్గింపు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కరణం, మేనేజర్ అనిత రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లిహారి, నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు
