TEJA NEWS

మౌళిక వసతుల కల్పనతో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

125 – గాజుల రామారం డివిజన్ మిథిలా నగర్ నందు 20.00 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మౌళిక వసతుల కల్పనలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి పరుస్తామన్నారు. మౌళిక వసతుల కల్పనతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా పనిచేస్తాం.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, చిన్నా చౌదరి, బాబీ చౌదరి, శివా నాయక్, ఆసిఫ్, ప్రసాద్, నిజాంపేట్ కార్పొరేషన్ కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మిథిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సురేష్, చైర్మన్ ఠాగూర్, ప్రధాన కార్యదర్శి చెంగల్ రాయుడు, ఉపాధ్యక్షులు చంద్రమోహన్, కమిటీ సభ్యులు నరసింహ, హన్మంత్ రావు, శ్రవణ్, రామకృష్ణ, శివ, ప్రవీణ్ పోతినేని, కిషోర్, సుధాకర్, వెలగపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.